Mirai: మిరాయ్ గూస్‌బంప్స్ గ్యారెంటీ మూవీ – తేజ సజ్జా

మిరాయ్ లో మనోజ్ 2.o చూస్తారు. ఖచ్చితంగా సినిమా గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: రాకింగ్ స్టార్ మంచు మనోజ్
సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్’ (Mirai) లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో తేజ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన సినిమా అభిమానులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్లోకి వస్తుంది. ఇది ఒక యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి చూడండి. మీకోసం ఒక వరల్డ్ ని ప్రిపేర్ చేసి ఉంచాము. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే సినిమాని తీసుకొస్తున్నాం. చాలా హార్డ్ వర్క్ చేసి చేసాం. తప్పకుండా మీ అందరి అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే ఇంత గ్రాండ్ స్కేల్లో సినిమా వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ అవడం అనేది పెద్ద విషయం. కానీ మీరందరూ నన్ను ఎంతో దూరం తీసుకొచ్చారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నేను చూసినా వన్ అఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ విశ్వ గారు. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా పాషన్ ఉండాలి. ఈ సినిమాకి ఆయన ఒక స్ట్రాంగ్ పిల్లర్. డైరెక్టర్ కార్తీక్ గారు ఈ కథ చెప్పినప్పుడే చాలా యంబిషియస్ గా అనిపించింది. వెంటనే సినిమాని మొదలు పెట్టడం జరిగింది.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. మనోజ్ గారు ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడింది. రెండున్నర ఏళ్ల పాటు ఈ సినిమాల్లో పని చేసిన అందరూ ఎంతో శ్రమించారు. రితిక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. డైరెక్టర్ కార్తీక్ గారు ఎంత అద్భుతమైన సినిమా ఇచ్చారో మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరతో హనుమాన్ తర్వాత కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన గూజ్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఇచ్చారు. కార్తీక్ గారి విజువల్స్, హరి మ్యూజిక్ ఎన్నిసార్లు గూస్ బంప్స్ ఇస్తుందో చెప్పలేను. గూజ్బంప్స్ గ్యారెంటీ. శ్రీయ గారు మా సినిమాలో పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. జయరాం గారు జగపతిబాబు గారు అందరూ కూడా ఈ సినిమా కంటెంట్, టీం పాషన్ ని నమ్మి చేశారు. జగపతిబాబు గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ గారు లాంటి గొప్ప ఎడిటర్ ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ సినిమాకి రైటర్ గా పని చేసిన మణి గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ గారికి కో డైరెక్టర్ అనిల్, టీంలో పని చేసిన అందరికీ థాంక్యూ వెరీ మచ్. మా కో ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ గారికి హ్యాట్సాఫ్. భవిష్యత్తులో చాలా పెద్ద సినిమాలు తీయబోతున్నారు. మా సినిమా రిలీజ్ చేస్తున్న అందరి డిస్ట్రిబ్యూటర్లకు థాంక్యూ. యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయి. అందరూ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 12 థియేటర్లకు వస్తుంది. మంచి సినిమా చేశాం. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి. సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. సినిమాని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అందరికీ అందుబాటులో ఉండే టికెట్స్ రేట్స్ తో సినిమా చూడబోతున్నారు. చాలా తక్కువ ధరకే థియేటర్స్ లో చూడబోతున్నారు. టికెట్స్ లో ఎలాంటి పెంపు లేదు. ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తీసాం. ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి. అందుకే ఎలాంటి టికెట్ రేట్లు పెంచలేదు. ఈ సినిమాల్లో యాక్షన్ అడ్వెంచర్ ఎలివేషన్ డివోషనల్ తో పాటు రెండు సర్ ప్రైజ్ లు ఉన్నాయి. అవి మీరు థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాలి. అందరూ మిరాయ్ చూడాలని కోరుకుంటున్నాను.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పర్సనల్ గా చాలా ఎమోషనల్ గా ఉంది. నా ఫస్ట్ సినిమా దొంగ దొంగది మొత్తం వైజాగ్ లోనే తీశాం. నా దాదాపు సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. నా కెరియర్ లో చిన్న గ్యాప్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య సినిమా ఎప్పుడు అని అందరూ ఎంతో ప్రేమగా అడిగేవారు. నాకు ఎప్పుడూ మీరు అండగా ఉన్నారు. ఎలాంటి సినిమాతో మళ్ళీ రావాలి అనుకున్నప్పుడు మా డైరెక్టర్ కార్తీక్ నా జీవితంలోకి శ్రీ రాముడిలాగే వచ్చారు. ఇంత గొప్ప స్క్రిప్ట్ ఎలా ఆలోచించగలిగారనిపించింది. మిరాయ్ సినిమానే నాకు కం బ్యాక్ అని ఈ సినిమా ఒప్పుకున్నాను. ఇంత అద్భుతమైన సినిమా తీసిన మా డైరెక్టర్ గారిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ సినిమా బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో చేస్తున్నాను. నిజంగా క్యారెక్టర్ మనోజ్ 2.0. వెరీ పవర్ఫుల్. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏది అడ్డు వచ్చినా ఫసక్. ఇంత గొప్ప క్యారెక్టర్ లో నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ విశ్వ గారికి ధన్యవాదాలు. మా ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ నమ్మి సినిమా చేశారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను.
తేజ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మంచి కథకు కుదిరితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తానని తనకి మాటిచ్చాను. తను ఈ కథ తీసుకొచ్చి చెప్పిన వెంటనే క్యారెక్టర్ లోకి మారాను. ఈ సినిమా కోసం తమిళ్ కన్నడ హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పాను.సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తేజ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను పడిన కష్టానికి ఈ సినిమా పదింతల ఫలితాన్ని ఇస్తుంది. మిరాయ్ ఇంక పది పార్ట్ లుగా తీయాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 12 రిలీజ్. చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని చేసాం తప్పకుండా మీరందరూ థియేటర్స్ కి వెళ్లి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో కిర్రెక్కించే విజయం కావాలి. వరల్డ్ వైడ్ అద్భుతంగా ఆడాలి. విశ్వప్రసాద్ గారు అనుకున్నట్లుగా ఈ సినిమా పాన్ వరల్డ్ ఫ్రాంచైజీ గా మారాలి. రేపు మిరాయి బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. రేట్లు కూడా మీ అందరికీ నచ్చినట్లుగానే ఉంటాయి. ఈ సినిమా రెండు వారాలు పాటు హౌస్ ఫుల్ పెట్టాల్సిన బాధ్యత మీదే, తర్వాత ఒజీ వస్తుంది. నేను ఎంతగానో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి ఓజి, మా సినిమా ఒకే నెలలో రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే తమ్ముడు బెల్లంకొండ సాయి చేసిన కిస్కిందపురి మాతో పాటు రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమాలు బాగుంటే మూడు నాలుగు సినిమాలు కూడా హిట్ అవుతాయి. అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. వైజాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి అభిమానం, ప్రేమ నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. సెప్టెంబర్ 12న అందరూ థియేటర్స్ కి వచ్చి మిరాయ్ చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. చాలా అద్భుతంగా తీసిన సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుంది. ఇది నా ప్రామిస్.
ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మిరాయ్ విజువల్ వండర్. అద్భుతమైన లొకేషన్స్, ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక తెలుగు సినిమా డెఫినెట్ పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఈ సినిమాతో మిరాయ్ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ అవుతుంది. హనుమాన్ తర్వాత తేజ ఈ సినిమా కోసం చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. హరి గౌర ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో హిస్టరీ సూపర్ నేచురల్ పవర్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.