Mirai: మిరాయ్ కి బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి రుణపడి ఉంటా!: తేజ సజ్జా

సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’ (Mirai). ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో యూనిట్ అందరికీ మెమెంటోలు అందించి అభినందించారు.
బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మాతో ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీడియా వారికి, ఆడియన్స్ కి, మమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చిన రవి గారికి, రాధా మోహన్ గారికి, మారుతి గారికి, సంపత్ నంది గారికి, శ్రీరామ్ ఆదిత్య కి.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్యూర్ హార్ట్ తో వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాకి మేము చాలా ఈవెంట్లు చేశాము. ee ఈవెంట్ మాత్రం మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించిన టెక్నీషియన్స్ అందరికోసం. వాళ్లకి గుర్తుగా ఉండాలని ఈవెంట్ ని నిర్వహించాం. ఇలాంటి ఈవెంట్ ని పెట్టడానికి ముందడుగు వేసిన మా నిర్మాత విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ అయి దాదాపుగా 45 డేస్ అవుతుంది. ఒటీటీ కి వచ్చిన వరకూ కూడా థియేటర్లో రన్ నడుస్తుంది. ఓటీటీకి వచ్చాక కూడా ఈవెంట్ ని పెట్టడం విశ్వ గారి గొప్ప మనసు. ఇంత బ్రహ్మాండ్ బ్లాక్ బాస్టర్ లాంటి సినిమా ఇచ్చిన డాక్టర్ కార్తీక్ గారికి థాంక్యూ. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒక మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసి ఎంతో గొప్ప స్థాయికి తీసుకువెళ్తారు. నా కెరీర్లో నాకు ఇది ఎన్నో సార్లు చూపించారు. మీరు ప్రోత్సహించిన విధానం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మీ అందరికీ ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాను. ఆడియన్స్ వల్లే ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ పాదాభివందనాలు. థాంక్యూ.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మీడియాకు ధన్యవాదాలు. దీనిని ఫ్యాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ చేస్తున్నాం. మిరాయి విజయంతో ఇది మొదలైంది. జియో స్టార్ లార్జెస్ట్ యూజర్ బేస్ ఉన్న ఓటీటీ. తెలుగు సినిమాల్లో ఇది అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమా అవుతుందని వారి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ థాంక్యు.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమాని నేను ఎప్పుడు కూడా మ్యాజిక్ అనుకునేవాడిని. తీయడం మొదలుపెట్టాక మ్యాజిక్ అనేది నెమ్మదిగా అర్థమైంది. అందరి కొలాబరేషన్ తో సినిమా తయారవుతుంది. మా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్.
హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు విభా క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచిన విశ్వప్రసాద్ గారికి కృతి ప్రసాద్ గారికి థాంక్యూ సో మచ్. తేజ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన పాషన్ తోనే ఇది సాధ్యపడింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
మ్యూజిక్ డైరెక్టర్ గౌరా హరి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నన్ను కార్తీక్ గారికి పరిచయం చేసిన తేజ గారికి థాంక్యూ. హనుమాన్ తర్వాత నాకు గొప్ప కాన్వాస్ దొరకడం చాలా ఆనందంగా ఉంది నన్ను నమ్మి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్తీక్ గారికి థాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్.
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. తేజ, కార్తీక్ మిగతా టెక్నీషియన్ అందరు కూడా మాకు చాలా ఆప్తులు. ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది గొప్ప విజయం గా మేము భావిస్తున్నాం. సిజిని ఈ బడ్జెట్ లో ఇంత అద్భుతంగా తీయొచ్చు అని విశ్వ గారు మా అందరికీ ఒక పెద్దన్నలా చూపించారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాజులేషన్స్. ఈ సినిమాకి అన్ని వైపుల నుంచి అద్భుతమైన విజయం దక్కింది. విశ్వ గారు నుంచి రాజా సాబ్, ఆ తర్వాత వస్తున్న సినిమాలో కూడా పెద్ద విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మిరాయ్ అలంటి అద్భుతమైన సినిమా రావడం చాలా ఆనందంగా అనిపించింది. మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చిన సినిమా ఇది. ఇండియాలోనే క్వాలిటీతో సినిమా చేయగలమని విశ్వ గారు చేసిన ప్రయత్నానికి నిదర్శనమే ఈ సినిమా. మన దగ్గర కూడా ఎంత అద్భుతమైన టీం ఉందని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం కార్తీక్ ఎంత కష్టపడ్డాడో నాకు బిగినింగ్ నుంచి తెలుసు. ఇది టెక్నీషియన్స్ కి జరుగుతున్న ఒక సత్కారం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పనిచేయాలని ఆసక్తిని కలిగించారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా రాజాసాబ్ కూడా మీ అందరి అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. అందరికీ థాంక్యు
డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇంత అద్భుతమైన విజన్ కి సపోర్ట్ చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి కంగ్రాజులేషన్స్. కార్తీక్ ఈ సినిమాని అద్భుతమైన ప్యాషన్ తో తీశారు. ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. తేజ కి థాంక్ యూ, ఈ టీం తో కలిసిన కలిసి వర్క్ చేసిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మంచి సినిమా మాకు అందించిన విశ్వప్రసాద్ గారి విజన్ కి హ్యాట్సాఫ్. హీరో తేజ గారు ఈ కథని ఈ స్థాయిలో బిలీవ్ చేయకపోతే ఇంత మంచి సినిమా దక్కేది కాదు. మిరాయి సినిమా మా తెలుగు సినిమానే అనే గర్వంగా చెప్పుకునేలా తీశారు. డైరెక్టర్ కార్తీక్ గారు చాలామందికి గ్రేట్ ఎగ్జాంపుల్ కాబోతున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్ తో సినిమాని తీశారు. తేజ ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలు చేయాలి మమ్మల్ని అందరినీ అలరించాలి. విశ్వ గారి పరిచయమే ఒక అదృష్టం. వారి నుంచి ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరెన్నో రాబోతున్నాయి.
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ… మిరాయి టీంలో పనిచేసిన అందరికీ కంగ్రాజులేషన్స్. డైరెక్టర్ కార్తీక్ మన ఇండస్ట్రీలో అద్భుతమైన టెక్నీషియన్. తనకి దక్కాల్సిన విజయం ఇది. తేజ ఈ సినిమాని ప్రమోట్ చేసిన తీరు అద్భుతం. తనకి హ్యాట్సాఫ్. మనోజ్ గారు తన క్యారెక్టర్ లో సూపర్ గా చేశారు. ఇలాంటి ఎపిక్ సినిమాని తీసిన ప్రసాద్ గారికి కంగ్రాజులేషన్స్. ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు హ్యాట్సాఫ్.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూట్ చేశాము. ప్రీమియర్ షో చూసిన తర్వాత విశ్వ ప్రసాద్ గారి కళ్ళల్లో ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి విజయాలు ఆయనకి మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. మిరాయ్ 2 కూడా దీనికి ఐదు రెట్లు పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.