Mirai: ఈ సక్సెస్ నాది కాదు, మా టీమ్ లో ప్రతి ఒక్కరిది: తేజ సజ్జా

సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’ (Mirai). ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మల్యే రఘురామకృష్ణంరాజు, డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్ హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ సూపర్ హీరో తేజ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన సినిమా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. రఘురామరాజు గారికి, కందుల దుర్గేష్ గారికి, కేసినేని చిన్ని గారికి, మా డైరెక్టర్ బాబీ గారికి అందరికీ చాలా థాంక్స్. ఈ సినిమా సక్సెస్ కార్తీక్ ఘట్టమనేనిది, విశ్వప్రసాద్ గారిది, మంచు మనోజ్ గారిది, శ్రీయ గారిది, రితికాది టీం అందరిదీ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ ది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ది. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వడమే గొప్ప వరం. అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. మీ అందరినీ థియేటర్స్ కి రమ్మని చెప్పాలంటే ముందు నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేనెప్పుడూ పెడతాను .ఈ సక్సెస్ ని నేను ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి సినిమా ఇచ్చానని మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను. నెక్స్ట్ చేసే సినిమాల్లో కూడా అంతే కృషి చేస్తాను. ఈ సినిమా ఫస్ట్ క్రెడిట్ కార్తీక్ గారికి దక్కుతుంది. మాకు గొప్ప ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ యాడ్ చేసిన మనోజ్ గారికి థాంక్యూ.
ఈ సినిమా కథ ఆయనకి ఎంతో నచ్చబట్టి సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చారు. శ్రీయ గారు ఈ కథకి అమ్మ పాత్ర పోషించారు. మణి గారికి మ్యూజిక్ డైరెక్టర్ హరి గారికి కాస్ట్యూమ్ డిజైన్ చేసిన రేఖ గారికి మేకప్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మీరు లేనిదే ఈ సినిమా లేదు. ఈ వేడుకని ఇంత అద్భుతంగా జరిగేలా మాకు అనుమతి ఇచ్చిన పోలీసువారికీ ధన్యవాదాలు. ఈ సినిమాని పైరసీ చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా చేశాము. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తారని నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరు. మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూస్తారని ఈ సినిమాకి ఎలాంటి టికెట్ ధరలు పెంచలేదు. హాలిడేస్ సీజన్లో తప్పకుండా ఈ సినిమాని ఫ్యామిలీస్ తో కలిసి చూడండి. మీకు ఒక ఎక్స్ట్రార్డినరీ విజువల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాది ప్రామిస్. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. నెక్స్ట్ వీక్ రాబోతున్న ఓజీ కోసం మనందరం వెయిటింగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా తెలుసు కదా టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యు సో మచ్.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ… అందరికి నమస్కారం.. మాది గుంటూరు. విజయవాడలో చదువుకున్నాను. ఇంద్ర సినిమా 175 డేస్ విజయవాడలోనే జరిగింది. ఆరోజు వచ్చిన వేలాదిమందిలో నేను ఒక్కడినే. ఆరోజు చిరంజీవి గారితో స్టేజి మీద ఉన్న చిన్న బుడ్డోడు తేజ. ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా అదరగొడుతున్నాడు. హనుమాన్ లాంటి సక్సెస్ తర్వాత ఒక సినిమాను నమ్ముకుని మూడేళ్లు పాటు డెడికేషన్ తో వర్క్ చేయడం మామూలు విషయం కాదు. తన డెడికేషన్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మిరాయి. నేను దర్శకుడు కాకముందే మనోజ్ అన్న పరిచయం. నాకు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఆఫర్ చేసింది కూడా తనే. ఇంత గ్యాప్ లో వచ్చిన తర్వాత కూడా అదరగొట్టేసారు. తను అంత బలంగా ఉన్నారు కాబట్టే చివరి నిమిషం వరకు థియేటర్ హోల్డ్ అయింది. వెల్కమ్ బ్యాక్ మనోజ్ అన్న. కార్తీక్ ఈ సినిమాకి కెమెరామెన్ గా డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా తీర్చిన దిద్దిన విధానం అద్భుతం. తను పడిన కష్టానికి ఫలితం దక్కిం.ది ఈ సక్సెస్ కి ప్రధాన కారణం విశ్వప్రసాద్ గారు. ఈ సినిమాతో నిర్మాతగా విశ్వ ప్రసాద్ గారి అమ్మాయి కృతి ప్రసాద్ గారు పరిచయమయ్యారు. తొలి సినిమాతో ఇంత అద్భుతమైన విజయం అందుకున్న వారికి అభినందనలు. ఇలాంటి నిర్మాతలు వందేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాట్స్. ఈ బ్యానర్ లో నెక్స్ట్ మొగ్లీ సినిమా రాబోతుంది. మిరాయ్ సక్సెస్ దానికి కూడా కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. నేను ఈ వేదిక మీద ఉండాలని కారణం డైరెక్టర్ కార్తీక్ గారు. ఆయన చిన్నవారైనా సరే ఆయన టాలెంట్ కి పాదాభివందనం. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అందరికీ ఫోన్ చేసి మా అబ్బాయి హిట్ కొట్టడని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా చాలా ఆనంద పడింది. నా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తుంటే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేను. నా విజయాన్ని మీ విజయంగా తీసుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న అభిమానులకు స్నేహితులకు అందరికీ పాదాభివందనం. ఎన్ని జన్మలెత్తినా ఈ అభిమానం ఉంటే చాలు. కార్తీక్ గారు అందరి ఆకలి తీర్చేశారు. విశ్వ గారు పట్టుదలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆయన మా అందరి వెనుక నిలబడ్డారు. నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్ రాబోతుంది. అది వేరే లెవెల్ లో వచ్చింది. గ్యారెంటీగా రికార్డులు తిరిగి రాస్తుంది. మహావీర్ లామా పాత్రకు వచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోలేను. కరెక్ట్ సినిమా తీస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్ కి వస్తారు. దానికి రుజువు మిరాయే. ఈ సినిమా పాన్ ఇండియా హౌస్ఫుల్ కి వెళ్తుంది నెక్స్ట్ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వస్తుంది. సెప్టెంబరు తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మరిచిపోలేని నెల. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కళకళలాడాలి. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి సినిమా చేయబోతున్నాను. అలాగే టి సిరీస్ వాళ్లతో అబ్రహం లింకన్ అనే సినిమా చేస్తున్నాను. రక్షక అనే సినిమా చేస్తున్నాను. మీ అందరి అభిమానం ఆప్యాయత ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు తేజ సజ్జ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నాను.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ కోసం చాలా కాలం ఎదురు చూసాం. మా అమ్మాయి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. తన ఫస్ట్ సినిమానే సక్సెస్ అవడం వెరీ హ్యాపీ. ఈ సినిమాకి చాలా అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్ జరిగింది. దీనికి స్పెషల్ థాంక్స్ రాజా సాబ్ మూవీ. ఆ సినిమాకి విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు. సినిమాకి వాయిస్ ఇచ్చిన ప్రభాస్ గారికి థాంక్యూ. సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ. అందరూ అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విజయవాడ థాంక్యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి కెమెరా డిపార్ట్మెంట్ కి థాంక్యూ . అన్ని కండిషన్స్ లో ఫుల్ సపోర్ట్ చేశారు. శ్రీయ గారు తన డిగ్నిటీతో అంబికా పాత్రకు ప్రాణం పోశారు. రితిక థాంక్యూ సో మచ్. కిషోర్ తిరుమల గారు మా కోసం మీ సినిమా చేశారు. మాకు రైటింగ్ లో కూడా సహాయం చేశారు. విశ్వ గారికి థాంక్యూ సో మచ్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. మనోజ్ అన్న ఒక మ్యాజిక్. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తేజ మూడేళ్ల తన జీవితాన్ని ఈ సినిమా కోసం పెట్టాడు. తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
శ్రియ శరన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్ కార్తీక్ గారికి థాంక్యూ. ఇది నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఫర్ ఎవర్. అద్భుతమైన సినిమా తీశారు. తేజ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. సినిమా పట్ల తనకున్న ప్రేమ బ్యూటిఫుల్. మనోజ్ చాలా టాలెంట్. తనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. హరి గౌర మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఓవర్ వెల్మింగ్. ఈ ఆనందం చెప్పడానికి మాటలు రావడం లేదు. ఈ సినిమాకి అద్భుతమైన విజయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేయండి
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సింగల్ స్క్రీన్స్ లో ఆల్ షోస్ ఫుల్ అవడం అంటే చిన్న మాటలు కాదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. ప్రతి ఒక్కరికి సినిమా చాలా బాగా నచ్చుతుంది. సినిమాకి బ్రహ్మరథం పట్టారని కలెక్షన్స్ కూడా చెబుతున్నాయి. ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా చూపించడం అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్. ఓన్లీ థియేటర్స్ లో చూసే సినిమా ఇది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. తేజ గారు మనోజ్ గారు శ్రీయ గారు రితిక గారు అందరూ అద్భుతంగా పెర్ఫాం చేశారు. డైరెక్టర్ కార్తీక్ సినిమాని చాలా ఒక విజువల్ వండర్లా తీశారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి పాషన్ వల్ల ఇది సాధ్యమైంది. పుష్ప తర్వాత మేము అలాంటి పుల్స్ చూస్తున్నాము. మాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తున్న నిర్మాత విశ్వప్రసాద్ గారికి ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మిరాయ్ సినిమా ఒక విజువల్ ట్రీట్. దర్శకుడు కార్తీక్ చాలా అద్భుతంగా తెరక్కించారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హీరో తేజ గారికి, మనసున్న మంచి మనిషి మంచి మనోజ్ గారికి, టీమ్ అందరికీ అభినందనలు. గౌరహరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజీ విశ్వ ప్రసాద్ గారు మంచి మనసున్న మనిషి. చాలా ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం విశ్వ ప్రసాద్ గారు నాకు ఎంతో ఆప్తులు. మిరాయ్ ఒక విజువల్ వండర్. తేజ చాలా అద్భుతంగా నటించాడు. ప్రతి నాయకుడు మా మనోజ్ అద్భుతంగా నటించాడు. ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగి ఉండే తేజ అన్ స్టాపబుల్ హీ.రో తను భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో రామ తత్వాన్ని అద్భుతంగా చూపిస్తూ ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఈ సినిమాని తీసిన డైరెక్టర్ కార్తీక్ గారికి హ్యాట్సాఫ్. ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. హరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే గొప్ప స్థాయిలో వుంది. రాబోయే రోజుల్లో రాజా సాబ్ తో విశ్వ ప్రసాద్ గారు మరింత గొప్ప విజయం చూడాలని, మరిన్ని విజయాలు వారికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యద్భుతంగా నిర్మించినటువంటి మిరాయ్ విజయాన్ని అందుకున్న శుభ సందర్భంలో విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటుచేసిన ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన సినిమాలోని నటీనటులకు సాంకేతిక వర్గానికి యావన్మంది అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. సుప్రసిద్ధ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు స్నేహ ధర్మాన్ని నాకు పంచి పెట్టే విధంగా రేపు జరిగే పుట్టినరోజునే ఒకరోజు ముందుగానే ఈ వేదిక మీద నిర్వహించడం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొన్ని రోజులుగా సరియైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ మిరాయితో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం అందులోనూ మన పురాణ ఇతిహాసాల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ చిత్రం ఇంత విజయనందుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అద్భుతమైన విజయాన్ని అందుకున్ననిర్మాత విశ్వ ప్రసాద్ గారికి దర్శకుడు కార్తీక్ హీరో తేజకి అభినందనలు తెలియజేస్తున్నాను. తేజకు బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ప్రతి నాయకునిగా అద్భుతమైన పాత్ర పోషించిన మంచు మనోజ్ గారికి అభినందనలు. ఈ సినిమాల్లో పని చేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా అభినందనలు.
మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. గత ఎడాది హనుమాన్, ఈ సంవత్సరం మిరాయ్ తో విజయాలు అందుకోవడం చాలా ఆనందంగా. విశ్వ ప్రసాద్ గారికి కార్తీక్ గారికి తేజ గారికి అందరికీ థాంక్యు. నా మ్యూజిక్ టీం కి థాంక్యూ. మా లిరిక్ రైటర్స్ కి కి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. మిరాయ్ లాంటి అద్భుతమైన కథ ఈ జనరేషన్ కి ఒక సినిమా రూపంలో చెప్పడం చాలా గొప్ప విషయం. మన చరిత్రను తెలియజేసే ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. మనోజ్ గారిని ఈ సినిమాలో చూసిన తర్వాత చాలా పర్సనల్ గా అనిపించింది. తేజ ఇలాంటి జోనర్ సినిమాల్ని మరిన్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన ఔట్పుట్ తీసుకొచ్చిన డైరెక్టర్ కార్తీక్ గారికి కంగ్రాజులేషన్స్. మిరాయ్ సినిమా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. నన్ను బిలీవ్ చేసి విశ్వప్రసాద్ గారు మొగ్లీ అనే సినిమా ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించే ప్రొడ్యూసర్ ఆయన. థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా మిరాయ్.
రైటర్ మణి బాబు కరణం మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాని నేను రాయగలనని భుజం తట్టి ప్రోత్సహించిన మా డైరెక్టర్ కార్తీక్ గారికి ధన్యవాదాలు. విశ్వ ప్రసాద్ గారి ప్రోత్సాహం మర్చిపోలేం. తేజ గారు చిరంజీవి అంత భవిత ఉన్న వ్యక్తి. ఈ సినిమాని ప్రేక్షకులు మనస్పూర్తిగా అక్కున చేర్చుకున్నందుకు వందనాలు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానుల, ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.