కళాతపస్వికి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఢిల్లీలో జరిగిన 64వ జాతీయ చలనచిత్ర ఉత్సవ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఫాల్కే అవార్డును అందుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలుగు ఫిలిం ఫెడరేషన్, దర్శక నిర్మాతల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సినీ ప్రముఖులు తదితరులు విశ్వనాథ్ దంపతులకు శాలువాలు కల్పి పుష్పగుచ్చం అందజేశారు. పెద్దఎత్తున విశ్వనాథ్ అభిమానులు తరలిరావడంతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.













