రోజా తనయ అన్షు మాలిక హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ?
సినిమాల్లో హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకున్న రోజా సెల్వమణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. మంత్రిగానూ పని చేస్తున్నారు. ఇక రాజకీయాల్లోనూ ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను దక్కించుకున్నారు.సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళంలో అగ్రహీరోలందరితోనూ నటించారు. కాగా.. ఇప్పుడు ఆమె నట వారసురాలిగా కుమార్తె అన్షు మాలిక సినీ రంగ ప్రవేశం చేయనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయమేమంటే.. తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్గా నటించి ఓ ఊపు ఊపిన హీరోయిన్స్‌లో రోజా ఒకరు. తెలుగులో చిరంజీవి నుంచి అగ్రహీరోలందరితో నటించారు. అలాగే తమిళంలో రజినీకాంత్ సహా టాప్ స్టార్స్ అందరితో నటించి మెప్పించారామె. కాగా.. ఇప్పుడు ఆమె నట వారసురాలిగా కుమార్తె అన్షు మాలిక సినీ రంగ ప్రవేశం చేయనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ హీరో కుమారుడి సినిమాలో అన్షు నటించనుందని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. నటనకు సంబంధించిన మెళుకువల కోసం అన్షుని రోజా యు.ఎస్‌లోని ఓ ప్రముఖ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయించనుందని టాక్ చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలపై రోజా ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రోజా తన కుమార్తె అన్షు మాలిక గురించి చెబుతూ తను స్కూల్లో టాపర్ అని అన్నారు. అంతే కాకుండా చిన్న వయసులోనే ఓ స్వచ్చంద సంస్థకు సంప్రదించి వారి సహాయంతో ఐదుగురు అనాథ పిల్లలకు సాయం చేస్తుందని కూడా రోజా తెలిపారు. రోజా భర్త గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. సీనియర్ డైరెక్టర్ ఆర్.కె.సెల్వమణి.. ప్రస్తుతం చెన్నైలోని సినీ కార్మికుల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.













