మోహన్ బాబుతో మంత్రి నాని భేటీ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు మంచు విష్ణు, తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబుతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. జూబ్లిహిల్స్‌లోని మోహన్‌బాబు నివాసానికి వచ్చిన మంత్రికి విష్ణు సాదరంగా స్వాగతం పలికారు. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ పలువురు సినీ ప్రముఖులతో జరిపిన చర్చల సారాంశానిన విష్ణు, మోహన్ బాబులకు మంత్రి నాని వివరించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. చిన్న సినిమాలు కూడా బతికేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సినీ పెద్దలను కోరారని తెలిపారు. సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని అన్నారు. ఏపీలో కూడా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని, స్టూడియోలు నిర్మించాలని నాని కోరారు. మా కు తోడ్పాడు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినానిని మోహన్‌బాబు, విష్ణు సన్మానించారు.