100 మిలియన్ వ్యూస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న మహేష్!
ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ సినిమాలు సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు. ఈ రెండు సినిమాలూ సూపర్‌హిట్ అయ్యాయి. అయితే రిలీజ్‌కి ముందే అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ అయిపోవడంతో సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయిపోతుందని అందరూ ముందే ఊహించారు. అందరి అంచనాలను మించి ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
ముఖ్యంగా పాటలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. సినిమా విజయంలో పాటలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి చెప్పాలంటే.. సినిమా రిలీజ్‌కి ముందు పాటలకు అంత క్రేజ్ రాలేదు. సినిమా రిలీజ్ తర్వాత పాటలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ మ్యూజికల్‌గా, వీడియో పరంగా అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఒకప్పుడు హీరోల అభిమానుల మధ్య కలెక్షన్ల రచ్చ జరుగుతూ ఉండేది. ఇప్పుడు కొత్తగా యూ ట్యూబ్ వ్యూస్ గొడవ మొదలైంది.
అలవైకుంఠపురములో చిత్రంలోని పాటలు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించడంతో బన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మైండ్ బ్లాక్ సాంగ్‌కి 100 మిలియన్ వ్యూస్ రావడంతో ఇప్పుడు మహేష్ అభిమానులు కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.













