ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ చేరిన హీరోలు

అమెరికాలో బాలీవుడ్ హీరోలకు సమానంగా మన హీరోలు కూడా మంచి క్రేజీని సంపాదించుకున్నారు. వారు నటించిన చాలా చిత్రాలు అత్యధిక కలెక్షన్లను కురిపించింది. ఇలా అత్యధిక కలెక్షన్లను సాధించిన హీరోలలో ప్రభాస్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ ఉన్నారు.
సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ప్రభాస్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహో చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఆగస్ట్ 30న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ కలెక్షన్స్‌ను సాధిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.205కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో సాహో రెండు మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరిపోయింది. దీంతో హీరో ప్రభాస్ ఓవర్‌సీస్‌లో కొత్త రికార్డును సాధించిన హీరోగా మారారు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా వరుసగా మూడు సార్లు ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్లను సాధించలేదు. కేవలం ప్రభాస్ మాత్రమే బాహుబలి – 1, బాహుబలి – 2, సాహో వరుస చిత్రాలతో ఈ రికార్డును సాధించాడు.
కలెక్షన్ల పరంగా చూసుకుంటే బాహుబలి పార్ట్ 1 ఓవర్సీస్‌లో 6.8 మిలియన్ డాలర్ల(రూ. 48 కోట్ల 90 లక్షలు)ను కొల్లగొట్టగా.. బాహుబలి పార్ట్ 2 ఏకంగా 20.5 మిలియన్ డాలర్ల(రూ. 147 కోట్ల 42 లక్షలు)తో ఎవరూ అధిగమించలేని స్థానంలో కూర్చుంది. ఇక సాహో విడుదలైన మూడు రోజుల్లోనే 2 మిలియన్ క్లబ్‌లో చేరిపోయింది. లాంగ్‌రన్‌లో సాహో చిత్రం 4 మిలియన్ మార్క్‌ను చేరుకోవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓవర్సీస్‌లో చాలామంది హీరోలు 2 మిలియన్ డాలర్ క్లబ్‌లో ఉన్నారు. రామ్ చరణ్ రంగస్థలం చిత్రం ద్వారా 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఓవర్సీస్ అత్యధిక కలెక్షన్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత మహేష్ బాబు భరత్ అనే నేను (3.4 మిలియన్ డాలర్లుు రూ. 24 కోట్ల 46 లక్షలు), శ్రీమంతుడు (2.8 మిలియన్ డాలర్లుు రూ. 20 కోట్ల 14 లక్షలు) చిత్రాలతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఓవర్సీస్‌లో 2.06 మిలియన్ డాలర్ల(రూ. 14 కోట్ల 81 లక్షలు)ను వసూలు చేసింది. అదే మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్ నటించిన రెండు చిత్రాలు ఓవర్సీస్‌లో 2 మిలియన్ క్లబ్‌లో ఉండటం విశేషం. వరుణ్‌తేజ్ నటించిన ఎఫ్2 ఓవర్సీస్‌లో 2.1 మిలియన్ డాలర్లు(రూ. 15 కోట్ల 11 లక్షలు) సాధించగా.. ఫిదా చిత్రం 2.07 మిలియన్ డాలర్లు(రూ. 14 కోట్ల 89 లక్షలు) సాధించింది.
ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత(2.1 మిలియన్ డాలర్లు ు రూ. 15 కోట్లు), నాన్నకు ప్రేమతో(2.02 మిలియన్ డాలర్లుు రూ. 14 కోట్ల 53 లక్షలు) చిత్రాలు 2 మిలియన్ క్లబ్‌లో ఉన్నాయి. వీరితో పాటు లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో ఓవర్సీస్‌లో 2 మిలియన్ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నాడు. గీతగోవిందం చిత్రం ఓవర్సీస్‌లో 2.4 మిలియన్ డాలర్ల(రూ. 17 కోట్ల 25 లక్షలు)ను కొల్లగొట్టింది. సావిత్రి బయోపిక్ మహానటి చిత్రం కూడా ఓవర్సీస్‌లో బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ డాలర్ల(ు రూ. 17 కోట్ల 97 లక్షలు) కలెక్షన్లను కొల్లగొట్టింది. నితిన్, సమంత జంటగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ చిత్రం కూడా 2.4 మిలియన్ డాలర్ల(ు రూ. 17 కోట్లు)తో 2 మిలియన్ క్లబ్‌లో చేరిపోయింది. అత్తారింటికి దారేది, మహర్షి, జనతా గ్యారేజ్, అర్జున్ రెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు 2 మిలియన్ డాలర్లకు చేరువలో ఆగిపోయాయి.