పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ లో మైక్ టైసన్?
బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎవరైనా గొడవ చేస్తున్నా? కండలతో కనపడినా!.. మనకు తెలియకుండా మన నోటి వెంట వచ్చే పేరు మైక్ టైసన్. కొన్ని దశాబ్దాల ముందు నుంచి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ అంతటి ప్రభావాన్ని చూపాడు మరి. అలాంటి గ్రేట్ బాక్సర్ మన టాలీవుడ్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో మనం ఊహించగలమా!.. కానీ ఇది నిజం కాబోతుందని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ‘లైగర్’ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో మైక్ టైసన్ నటిస్తాడంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలపై లైగర్ టీమ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.













