Nenu Ready Music : హవీష్, త్రినాధ రావు నక్కిన, నిఖిల కోనేరు, హార్నిక్స్ ఇండియా LLP ‘నేను రెడీ’ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్
 
                                    నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో హవీష్, సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ త్రినాధ రావు నక్కినతో కలిసి కంప్లీట్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’ చేస్తున్నారు. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ ( Mickey J Meyer) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మాస్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన, మెలోడీ కంపోజర్ మిక్కీ జె మేయర్ కలిసి పని చేయడంతో ఈ సినిమాలో మాస్, మెలోడియస్ ట్యూన్ల కలయికను ఆశించవచ్చు.











 
                                                     
                                                        