మెరిసే మెరిసే ప్రీ రిలీజ్ వేడుక ..
దినేష్‌తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం మెరిసే మెరిసే పనవ్కుమార్ కె దర్శకుడు. వెంకటేష్ కొత్తూరి నిర్మాత. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, ఆశలకు ప్రతీకగా ఈ సినిమాను రూపొందించాం. ఇరవైఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఓ రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి ఓ జంట తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశారన్నదే ఈ చిత్ర కథాంశం. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది అన్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే చిత్రమిదని నిర్మాత వెంకటేష్ కొత్తూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నగేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, రచన- దర్శకత్వం: పవన్‌కుమార్.













