మేమ్ ఫేమస్.. ఆ సినిమాలా ఉందే..
ఏదో ఓ చిన్న యూట్యూబ్ ఛానెల్ గా స్టార్ట్ అయిన ఛాయ్ బిస్కెట్ ఇప్పుడు నిర్మాణ సంస్థగా మారి సినిమాలు నిర్మించే రేంజ్‌కు వెళ్లింది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించిన ఛాయ్ బిస్కెట్ ఇప్పుడు మేమ్ ఫేమస్ అనే ఓ యూత్‌ఫుల్ మూవీని నిర్మించింది. ఈ మూవీకి రచయిత, డైరెక్టర్, హీరో సుమంత్ ప్రభాస్. యూట్యూబర్ గా వచ్చిన సుమంత్ ప్రభాస్, ఛాయ్ బిస్కెట్ సపోర్ట్ తో మేమ్ ఫేమస్ మూవీని చేశాడు.
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే జాతిరత్నాలు సినిమా గుర్తొస్తుంది. యూత్ కి నచ్చే అంశాలు, గ్రామీణ నేపథ్యం, అల్లరి చిల్లరగాగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు. కథ లో ఛేంజ్ ఉన్నా బ్యాక్ డ్రాప్ మాత్రం ఒక్కటే. అదే తరహాలో మేమ్ ఫేమస్ సినిమా రాబోతుందిప్పుడు.
ఈ సినిమాకు ప్రమోషన్లను మాత్రం జోరుగా చేస్తుంది ఛాయ్ బిస్కెట్. రీసెంట్ టైమ్ లో జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తేనే సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఛాయ్ బిస్కెట్ ఈ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తుంది. మే 26న సినిమా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ అనిపిస్తుంది. మరి ఈ సినిమా జాతి రత్నాలు రేంజ్ మూవీ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.













