అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ నుంచి ‘మెల్ల మెల్లగా’ సాంగ్ రిలీజ్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష సరసన రుక్సార్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని ‘మెల్ల మెల్లగా’ అంటూ సాగే పాటను నేడు చిత్రబృందం విడుదల చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర సమర్పకులు. మెగాబ్రదర్ నాగబాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













