మెహ్రీన్ కు మరో లక్కీ ఆఫర్
ఎఫ్ 2తో ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినా కూడా అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది యంగ్ హీరోయిన్ మెహ్రీన్‌కు. ఈ చిత్రం తరువాత పలు పెద్ద ప్రాజెక్ట్ లలో అవకాశాలు వస్తాయని అనుకోని ఎదురుచూసిన ఆమెకు నిరాశే మిగిలింది. అయితే ఇటీవల గోపీచంద్ తిరు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ బూటీ తాజాగా మరో ఆఫర్‌ను పట్టేసిందని సమాచారం. యంగ్ హీరో నాగశౌర్య ఓ నూతన దర్శికుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.













