బాలకృష్ణ తో జతకట్టనున్నమెహ్రీన్ కౌర్ పిర్జాదా?

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీహంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిఫ్స్ విశేషంగా ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా క్ర్రాక్ తో రవితేజకు సూపర్ హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. అదే జోష్ తో బాలయ్య బాబు సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ సినిమా కోసం కూడా క్రాక్ లో ఇరగదీసిన వరలక్ష్మి శరత్ కుమార్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ యంగ్ హీరోయిన్ కు తీసుకోవాలని చూస్తున్నారు. టాలీవుడ్ సమాచారం మేరకు మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఎఫ్3, మారుతి.. సంతోష్ శోభన్ కాంబినేషన్ సినిమాలో నటిస్తుంది మెహ్రీన్. ఇక ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. ఈమధ్యనే ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్న ఈ భామ పెళ్లికి కొద్దిగా టైం పెట్టుకున్నారని సమాచారం. అందుకే ఈలోగా వచ్చిన సినిమాలన్ని చేసేయాలని చూస్తుంది.
తెలుగులో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ పిర్జాదా యువ హీరోలతో సినిమాల్లో చేస్తూ వచ్చింది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో సినిమాలో కూడా మెహ్రీన్ ఓకే చెప్పిందని టాక్. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఇక సీనియర్ హీరోయిన్ టబు ని ఒక హీరోయిన్ గా తీసుకోవాలని అడిగితే ఆమె చేయనని చెప్పినట్టు తెలుస్తుంది. పెళ్లికి ముందు వరుస సినిమాలతో సత్తా చాటుతుంది మెహ్రీన్ కౌర్. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది చెప్పలేదు. ప్రస్తుతానికి అయితే వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెబుతూ వెళ్తుంది అమ్మడు. ఒకవేళ చేస్తున్న సినిమాల్లో ఏది హిట్టైనా అవకాశాలు రావడం పక్కా సో పెళ్లి తర్వాత కూడా అమ్మడు సినిమాలు చేస్తుందనే చెప్పొచ్చు.