‘మెహబూబా’ ట్రైలర్ విడుదల
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేశాక ఇప్పుడు ట్రైలర్ తో కట్టిపాడేశాడు పూరి జగన్. తన పదునైన డైలాగులు.. అలాగే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఆర్మీ నీడలో జరిగే సన్నివేశాలు.. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లు.. మధ్యలో అందరికీ తెలిసిన ఒక హిందూ ముస్లిం ప్రేమ కథ.. అబ్బో అరిపించాడంతే. ఇక ఆకాష్ కూడా ఏమీ తక్కువ కాదులే.. మొన్నటివరకు చిన్నపిల్లాడిలా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు మాస్ హీరోలా అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీ అతనికి చాలా ప్లస్సవుతుంది. నిత్యా లుక్స్ కూడా చాలా బాగున్నాయ్. ఓవరాల్ పూరి ఇప్పుడు హిట్టు కంటెంటుతో రంగంలోకి దిగుతున్నట్లే ఉన్నాడు. సినిమాకు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, అందుకు తగిన విధంగా అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసింది.













