భోళా శంకర్ కు తప్పని లీకుల బెడద
సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని ఎంతో ఆశపడుతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాకు రిలీజ్‌ల బెడద యూనిట్‌ని ఇబ్బంది పెడుతోంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఓ లీకు నెట్టింట వైరల్ అవుతోంది.
రీసెంట్గా మూవీలోని ఓ రొమాంటిక్ సాంగ్‌కు సంబంధించిన క్లిప్ నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇందులో తమన్నా చిరంజీవి డ్యాన్స్ వేస్తూ కనిపించారు. చూస్తుంటే ఇదో రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. లొకేషన్స్ చాలా బాగున్నాయి. లీక్డ్ క్లిప్ లోనే లొకేషన్ ఇంత అందంగా ఉంటే, ఇక వెండితెరపై ఈ లొకేషన్స్ ఎంత అందంగా ఉంటాయో అనుకుంటున్నారు ఆ వీడియో చూసిన వారంతా.
మంచి మెలోడీగా పాట అయ్యే అవకాశముంది. పాట కూడా వినసొంపుగా ఉండగా, చిరూ తమన్నా జంట కూడా చూడటానికి చాలా అందంగా కనపిస్తోంది. ఆగస్టు 11 న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా మూవీ టీం ప్రకటించడం విశేషం. ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ కామెడీగా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ యాక్షన్ కామెడీ సినిమాలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన ప్రతి పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా వేదాళం రీమేక్ అయినప్పటికీ ఇందులో చిరూని ఎలా చూపిస్తారా అనే ఆసక్తి ఎక్కువగా ఉంది. మరి మెగాస్టార్ భోళా శంకర్‌తో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.













