వశిష్ఠతోనే ముందు స్టార్ట్ చేయనున్న మెగాస్టార్
వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవికి ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు. రీసెంట్గా చిరూ నుంచి వచ్చిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం వీకెండ్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను అందుకోలేకపోయింది.
ఈ ఎఫెక్ట్ చిరూ తర్వాతి సినిమాలపై పడింది. చిరూ మామూలుగా అయితే ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ కురసాలతో సినిమాను పట్టాలెక్కించాల్సింది. కానీ భోళా శంకర్ రిజల్ట్ తర్వాత కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న చిరూ ఇప్పుడు ఆ సినిమాను హోల్డ్ లో పెట్టేశాడు. స్క్రిప్ట్ మీద మళ్లీ పని చేయమని కళ్యాణ్ కృష్ణకు చెప్పినట్లు సమాచారం.
చిరూ శాటిస్ఫై చేసే అవుట్ పుట్ వచ్చాకే ఈ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు చిరూ. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఇప్పుడు ఫ్యాన్స్‌కు వస్తున్నాయి. ఇదిలా ఉంటే చిరూ తర్వాతి సినిమా వశిష్ఠతో చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సోషియో ఫాంటసీ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిరూ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, ఈ సినిమాను ప్రారంభించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.













