మెగాస్టార్ అభిమానులకు తీపి కబురు
ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తీపి కబురు అందించారు. ఉగాది నుండి సోషల్ మీడియాలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు చిరంజీవికి సోషల్ మీడియా అకౌంట్లు లేవు. ఇంతవరకు ఏదైనా సందేశం ఇవ్వాలంటే వీడియో రూపంలో లేదా ప్రకటనగా ఇచ్చేవారు. ఇకపై మాత్రం ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నేను ఇవ్వాలనుకునే మెసేజ్లు, చెప్పాలనుకునే విషయాలను ప్రజలతో చెపా•కోవడానికి వేదికగా భావిస్తూ ఇక మీదట సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నాను. అది కూడా ఉగాది రోజు నుంచే అటూ వీడియలో వివరించారు.













