త్వరలో చిరంజీవి అంబులెన్స్ లు.. చిరు పై ప్రజల ప్రశంసల వెల్లువ

మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడన్న సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్నారని తన కంట పడితే చేతనైన సాయం చేస్తుంటారు చిరంజీవి. సినీ పరిశ్రమకు కష్టాలు వచ్చిన ప్రతీ సమయంలో ముందుంటారు. మెగాస్టార్చిరంజీవి ఆపద్బాంధవుడన్న సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్నారని ఏ మాత్రం తెలిసినా చేతనైన సాయం చేస్తుంటారు చిరంజీవి. గత ఏడాది కరోనాతో సినీ కార్మికులు అల్లాడుతున్న తరుణం లో సీసీసీని ఏర్పాటు చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ అంటూ ఇతర హీరోలనూ విరాళాలు ఇచ్చేలా స్ఫూర్తినిచ్చారు. అలా గత ఏడాది ఎంతో మంది ఆకలిని తీర్చారు. ఇక ఈ సెకండ్ వేవ్‌లోనూ తన దైన శైలిలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న చిరంజీవి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారు వాటిని వినియోగించుకోవచ్చని అన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లింది. చిరంజీవి ప్రస్తుతం అంబులెన్స్ సర్వీసులను స్టార్ట్ చేయబోతున్నారు. అపోలో హాస్పిటల్స్ సహా ఇతర ప్రైవేటు హాస్పిటల్స్ సహకారంతో ఈ సేవలను అందించడానికి చిరంజీవి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అపోలో ఆధ్వర్యంలో సినీ పరిశ్రమతో మమేకమైన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్స్ వేయించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాలతో అభిమానులే కాకుండా సాధారణ జనం కూడా చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.