కాస్త అలోచించి ఇన్వెస్ట్ చెయ్యి దూకుడువద్దు నాన్న!
టాలీవుడ్ లో కొత్త ప్రయోగాలు చేయడానికి బాలకృష్ణ, మహేష్ బాబు లు ముందుంటారు. అల్లాంటి వారు కూడా ప్రస్తుతం ఈ క్రైసిస్ తో భయపడుతున్న సమయం లో రామ్ చరణ్ మాత్రం చాలా దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. ఏ సినిమా అయినా సరే అతనికి కథ నచ్చితే చాలు ఏ పాత్ర అయినా సరే చేయడానికి చాలా రకాలుగా రెడీ అవుతున్నాడు. తన సొంత బ్యానర్ లో నచ్చిన కథకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. తన తండ్రి కూడా ప్రయోగాల విషయంలో గతంలో అంత దూకుడుగా వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు చిరంజీవి కూడా తన కొడుకు దూకుడు చూసి షాక్ అవుతున్నారట. ఇటీవల ఒక కథ రామ్ చరణ్ వద్దకు రాగా మరో స్టార్ హీరోతో తాను నిర్మాతగా ఆ సినిమా చేస్తా అని హామీ ఇచ్చాడు అని టాక్. దీనిపై చిరు సీరియస్ అయ్యారట. అనవసరంగా దూకుడు వద్దు అని, ప్రస్తుతం వాతావరణం ఏ మాత్రం కూడా బాగా లేదు అని పెట్టుబడి పెట్టకు అని చెప్పారట. అంతే కాకుండా హీరో గా కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది టాలీవుడ్ లో అని చెప్పారు అని టాక్. టాలీవుడ్ లో ఇప్పుడు అసలు వాతావరణం బాగా లేదు కాబట్టి ఏ మాత్రం కూడా కంగారు వద్దు అని చెప్పారట చిరంజీవి.
ఒక సినిమా చేయాలి అంటే మాత్రం అన్నీ ఆలోచన చేసి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది అని చెప్పారట. కథ బాగుంది కథా అని దిగితే అనవసరంగా ఇబ్బంది పడతావు అని చెప్పారట. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఏ విధంగా ముందుకు వెళ్తారు నేది చూడాలి.













