కుర్ర దర్శకుల తో మా కుర్ర హీరో మెగా స్టార్! అంటూ తెగ మురిసి పోతున్న మెగా అభిమానులు
చిన్న పెద్ద అని తేడా లేకుండా తన ఆల్‌రౌండర్ యాక్టింగ్ తో ఎన్నో దశాబ్దాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇటీవల సోషల్ మీడియాలోకి వచ్చాక చిరంజీవి యూత్ అయిపోయాడు… కుర్ర హీరోలతో సమానంగా పోస్టులు, పిక్‌లు పెడుతూ ఫుల్ జోష్ చూపిస్తున్నాడు. అభిమానులని ఎంతో ఆకట్టుకుంటున్నాడు. అంతే కాకుండా వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అదే విధంగా యువ దర్శకులకు పుల్ పని చెప్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సెట్ మీద ఉండగా మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. ఇంకో సినిమా లైన్లో పెట్టేశాడు. మరో దర్శకుడికి ఓకే చెప్పేశాడు. చిరంజీవి ఫుల్ ఫామ్‌లో ఉన్న రోజుల్లో కూడా ఇంత జోరు చూపించింది లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో చిరంజీవి ఈ రోజు ఓ ఫొటో షేర్ చేశాడు. యువ దర్శకుల మధ్య చిరు యువకుడిలా వెలిగిపోతున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా యువ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ‘లూసిఫర్’ సినిమా రీమేక్‌ను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి చిరు సన్నిహితులు, హితులు, మిత్రులు అందరూ విచ్చేశారు. వారితోపాటు ప్రస్తుతం సినిమా చేస్తున్న కొరటాల శివ, తర్వాత రెడీగా ఉన్న మెహర్ రమేష్, బాబీ కూడా వచ్చారు. ఎలాగూ ‘లూసిఫర్’ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా అక్కడే ఉన్నాడు. దీంతో అందరూ కలసి చిరంజీవితో ఫొటో దిగారు. దానినే చిరంజీవి ఈ రోజు పోస్టు చేశాడు. ‘నా నలుగురు కెప్టెన్లు. ఈ నలుగురితో వినోదం మామూలుగా ఉండదు’ అంటూ ఓ వ్యాఖ్య కూడా రాశారు చిరు. ఆయన ఆ ఫొటోలో ఉన్నది నలుగురు కుర్రాళ్లు అని రాశారు కానీ… అభిమానులు మాత్రం ఫొటోలో ఉన్న ఐదుగురూ కుర్రాళ్లే అని అంటున్నారు.ఈ విధంగా మెగాస్టార్ యువ దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.













