అభిమానికి అండగా నిలిచిన మెగాస్టార్
క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమానిని చూసి మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. అతనికి అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దొండపాటి చక్రధర్. క్యాన్సర్ బారిన పడటంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. విషయం తెలుసుకున్న చిరంజీవి మెరుగైన వైద్య కోసం చక్రధర్ని హైదరాబాద్కు రప్పించి, ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. స్వయంగా అస్పత్రికి చేరుకుని చిరంజీవి తన అభిమానిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చక్రధర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తానెప్పుడూ అండగా ఉంటానని చక్రధర్ కుటుంబానికి మెగాస్టార్ ధైర్యాన్ని ఇచ్చారు.













