మెగా అభిమానులకు చిరంజీవి పుట్టిన రోజు నాడు హాఫ్ గిఫ్ట్ మాత్రమే
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 22న తన కొత్త సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల అవుతాయని పోస్టర్ విడుదల చేసారు ఆచార్య యూనిట్. నిజానికి కొరటాల శివ ఇంకాస్త ఎక్కువగానే ప్లాన్ చేసినట్టు టాక్. బాలయ్య పుట్టిన రోజున బోయపాటి వదిలినట్టు.. ఓ చిన్న డైలాగ్ తో టీజర్‌ని వదలాలని భావించాడట. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా రెడీ చేసి, రఫ్ కట్ కూడా చేసి పెట్టాడట. కానీ.. చిరంజీవి మాత్రం సున్నితంగా `నో` చెప్పినట్టు టాక్. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా ఇప్పటి వరకూ ఎలాంటి వివరాలూ బయటపెట్టలేదు. కనీసం టైటిల్ కూడా చెప్పలేదు. టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ నీ ఒకేసారి విడుదల చేసి. ఆ తరవాత.. చిన్న టీజర్ వదలాలన్నది చిరు ప్లాన్. అన్నీ ఒకేసారి అయితే ఆసక్తి తగ్గిపోతుందని భావించార్ట. వినాయక చవితి, దీపావళి.. ఇలా రాను రాను చాలా ప్రత్యేక సందర్భాలున్నాయి. అప్పుడు టీజర్ వదిలితే బాగుంటుందని చిరు ఉద్దేశం. అందుకే.. కొరటాల డైలాగ్ టీజర్ కట్ చేసినా, చిరు నో చెప్పాడట. ఈ బర్త్ డే కి అభిమానులు ఫస్ట్ లుక్ టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ తో సరిపెట్టుకోవాల్సిందే టీజర్ లేనట్టే.













