Mega158: మెగా158పై లేటెస్ట్ అప్డేట్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలను లైన్ లో పెట్టి యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad Garu) సినిమా చేస్తున్న చిరంజీవి ఆ సినిమాను నవంబర్ ఎండింగ్ కు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
అనిల్ సినిమా తర్వాత చిరూ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆల్రెడీ విశ్వంభర(viswambhara) షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ అనిల్ మూవీ తర్వాత బాబీ కొల్లి(bobby kolli) తో ఓ సినిమా, దసరా(dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండింటిలో చిరంజీవి, బాబీ తో సినిమాను ముందుగా పట్టాలెక్కించనున్నారు.
మెగా158(mega158) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుందని, డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఆల్రెడీ చిరంజీవి- బాబీ కలయికలో వాల్తేరు వీరయ్య(waltair veerayya) సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మరోసారి చేస్తున్న సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందోనని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు.













