Mega157: చిరూ లుక్ ఫిక్సైందా?

బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vasishta) దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు అందరికీ భారీ అంచనాలే కానీ ఎప్పుడైతే విశ్వంభర నుంచి టీజర్ వచ్చిందో అప్పట్నుంచి దానిపై అంచనాలు తగ్గుతూ వచ్చాయి. ఇక విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
అనౌన్స్‌మెంట్ తోనే అంచనాల్ని విపరీతంగా పెంచేసిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లింది కూడా లేదు కానీ మూవీపై విపరీతమైన బజ్ నెలకొంది. అనౌన్స్‌మెంట్ వీడియో నుంచి రీసెంట్ గా నయనతార(Nayanathara) ను హీరోయిన్ అని అనౌన్స్ చేస్తూ రిలీజైన వీడియో వరకు ప్రతీదీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది.
అయితే ఈ సినిమాలో చిరంజీవి లుక్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం లుక్ టెస్ట్ ను పూర్తి చేశాడని, ఈ సినిమాలో చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించనున్నాడని, వీలైనంత వరకు చిరూని మూవీలో స్టైలిష్ గా చూపించేందుకే ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. సాహు గారపాటి(Sahu Garapati), సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.