Mega157: మెగా157లో వారిద్దరి మధ్య కామెడీ నెక్ట్స్ లెవెల్

ప్రస్తుతం విశ్వంభర(Viswambhara) సినిమాతో పాటూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 157వ సినిమాగా వస్తోంది. మెగా157 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టుకుంది.
హీరోయిన్ గా నటిస్తున్న నయనతార(Nayanathara) కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం చిరంజీవి- నయనతార మధ్య ఫ్యామిలీ సీన్స్ ను షూట్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. సినిమాలో మెగాస్టార్, నయన్(Nayan) మధ్య వచ్చే ఈ కామెడీ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంటుందని, సినిమా మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ కానుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి చాలా గొప్పగా చెప్తున్నాడు. అనిల్ తనకు సినిమాను నెరేట్ చేస్తున్నంతసేపు కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నానని, ఈ మూవీ కచ్ఛితంగా ఫ్యాన్స్ కు నచ్చుతుందని మెగాస్టార్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. సాహు గారపాటి(Sahu Garapati), చిరంజీవి కూతురు సుస్మిత (Sushmitha) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది చూడాలి.