Mega157: మెగా157 టైటిల్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆగస్ట్ నెల వస్తుందా? ఎప్పుడు 22వ తేదీ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణం ఆ రోజున చిరూ పుట్టినరోజు కావడం. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆయన నటించే సినిమాల నుంచి ఆయా చిత్ర మేకర్స్ తమ హీరోకు బర్త్ డే విషెస్ చెప్తూ ఫ్యాన్స్ కోసం సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తుంటారు.
ప్రతీ ఏటాలానే ఈ ఏడాది కూడా చిరంజీవి బర్త్ డే సర్‌ప్రైజులు రెడీ అయ్యాయి. ప్రస్తుతం మెగాస్టార్(Megastar) చేతిలో రెండు సినిమాలున్నాయి. విశ్వంభర(Viswambhara) మరియు మెగా157(Mega157). ఈ రెండు సినిమాల నుంచి చిరూ(Chiru) బర్త్ డే కు స్పెషల్ ట్రీట్స్ ఉంటాయని ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ విశ్వంభర నుంచి మెగాస్టార్ బర్త్ డే కు ఓ స్పెషల్ ట్రీట్ ఇవాళ సాయంత్రం వస్తుందని స్వయంగా చిరంజీవినే వెల్లడించిన విషయం తెలిసిందే.
విశ్వంభర కాకుండా మరి అనిల్ రావిపూడి(Anil ravipudi) తో చేస్తున్న సినిమా పరిస్థితేంటా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్న టైమ్ లో మెగా157 చిత్ర యూనిట్ కూడా దీనిపై ఓ అప్డేట్ ను ఇచ్చారు. చిరంజీవి బర్త్ డే రోజున ఉదయం 11 గంటల 25 నిమిషాలకు టైటిల్ గ్లింప్స్ ను రివీల్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ రెండు అప్డేట్స్ తో మెగాస్టార్ 70వ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మారడం ఖాయం.