Mega157: మెగా157 టైటిల్ అదేనా?

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి విశ్వంభర(viswambhara) కాగా రెండోది మెగా 157. ఈ రెండింటిలో అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో నటిస్తున్న మెగా157(mega157) సినిమాపైనే ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. అనిల్(anil), చిరూ(Chiru) కాంబినేషన్ లో వస్తోన్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ టైటిల్ ను రివీల్ చేయడానికి మేకర్స్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఆగస్ట్ 21న సాయంత్రం 4.32 కు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయడానికి ముహూర్తం కుదిరిందని అంటున్నారు. మెగా157 కు వరప్రసాద్ గారు(Vara prasad garu) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి శివ శంకర వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.