Mega157: మెగాస్టార్ మరీ స్పీడుగా ఉన్నాడే!

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ మార్క్ కామెడీకి చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో పడితే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తితో ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే మంచి అంచనాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ ను అనుకున్న దాని కంటే ఒకరోజు ముందుగానే పూర్తి చేసిన అనిల్, రెండవ షెడ్యూల్ కోసం ముస్సోరి వెళ్లి అక్కడ కొన్ని కీలక సీన్స్ ను తెరకెక్కించి రెండో షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు.
ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా తాజా షెడ్యూల్ అంటే మూడో షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో చిరూ, నయన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నాడట అనిల్. కేథరీన్ థ్రెసా(catherine thressa) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా, మెగా157(mega157) షూటింగ్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి పరుగులెత్తిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో(bheems ciciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.