మరోసారి మెగా వర్సెస్ నందమూరి?
టాలీవుడ్ లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మారడం మిగిలిన సినిమాలకు ఇబ్బంది కలిగిస్తోంది. గతేడాది సలార్ లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అవడంతో ఇతర సినిమాలకు చాలా ఇబ్బందులొచ్చాయి. చూస్తుంటే ఈ ఏడాది కూడా అదే జరిగేట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేకర్స్ చెప్పిన ప్రకారమైతే దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడి ఆయనకు సర్జరీ అవడం, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండటం, అనిరుధ్ వర్క్ బ్యాలెన్స్ ఉండటం, ఆ టైమ్ లో ఏపీలో ఎలక్షన్స్ కూడా ఉండటంతో సినిమాను పోస్ట్ పోన్ చేసి మంచి అవుట్‌పుట్‌తో రావాలనుకుంటుందట దేవర టీమ్.
దేవరను పోస్ట్ పోన్ చేస్తే మళ్లీ దసరాకు రిలీజ్ చేసే ఛాన్సులున్నాయి. ఆ టైమ్ లోనే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ను కూడా రిలీజ్ చేయాలని దిల్ రాజు చూస్తున్నాడు. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి దేవర వర్సెస్ గేమ్ ఛేంజర్ అయ్యేట్లు సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పాన్ ఇండియా సినిమాలు కావడం, దానికి తోడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ హీరోల నుంచి వస్తున్న సినిమాలు కావడంతో వేటికవే స్పెషల్ క్రేజ్ దక్కించుకుంటాయి. దేవర రిలీజ్ డేట్‌పై ఈ క్లాష్ ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.













