Chiranjeevi: ఇంతకీ మెగాస్టార్ ముందు ఎవరితో?
భోళా శంకర్(Bhola Shankar) సినిమా డిజాస్టర్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తర్వాత ఎంతగానో ఆలోచించి సినిమా కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. రొటీన్ సినిమాలు తీసే సీనియర్ డైరెక్టర్లను పక్కన పెట్టేసి యంగ్ టాలెంట్ కు ఛాన్స్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే వశిష్ట(Vasishta)తో విశ్వంభర(Viswambhara) చేస్తున్నాడు చిరూ(Chiru). విశ్వంభర తర్వాత మరికొంత మంది దర్శకులను కూడా చిరూ లైన్ లో పెట్టాడు.
ఈ క్రమంలో తనకు వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాబీ(Bobby Kolli)తో మరో సినిమా చేయడానికి చిరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్(Daku maharaj) తర్వాత బాబీ ఈ సినిమా పనుల్లో దిగనున్నాడట. దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) దర్శకత్వంలో కూడా చిరూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని(nani) ది ప్యారడైజ్(The paradise) సినిమా పూర్తవగానే మెగాస్టార్ మూవీని మొదలుపెట్టనున్నాడు శ్రీకాంత్.
ఇది కాకుండా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో కూడా చిరూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడని, న్యూ ఇయర్ స్టార్టింగ్ లో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రానుందని తెలుస్తోంది. బాబీ, శ్రీకాంత్, అనిల్ రావిపూడిలో చిరూ ఎవరితో ముందు సెట్స్ పైకి వెళ్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరితో చేసినా తమ హీరో సినిమా హిట్టయితే చాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.













