ఇండియన్2 విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్
రీసెంట్ గా రిలీజైన ఇండియన్2 ట్రైలర్ మీద ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. స్టోరీని దాచిపెట్టకుండా కీలకమైన పాయింట్ ని చెప్పేసిన టీమ్ , ట్రైలర్ ను అంచనాలు పెంచేలా కట్ చేయలేదనే కామెంట్ నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. కమల్ హాసన్ ఎన్నో గెటప్స్ లో కనిపించినా అవేమీ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయలేకపోయాయి. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఇండియన్2 ట్రైలర్ కు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత కూడా శంకర్, సేనాపతికి సరైన బ్యాక్ గ్రౌండ్ సెట్ చేశారని, సినిమా అంచనాలను మించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా శంకర్ స్థాయికి తగ్గట్లు ఇండియన్2 ట్రైలర్ లేదనేది మాత్రం అధిక శాతం చెప్తున్న మాట.
రిలీజ్ దగ్గరపడుతుండటంతో టీమ్ మొత్తం ప్రమోషన్స్ ను వేగవంతం చేసే పనిలో బిజీగా ఉంది. ఈ నెలాఖరులో హైదరాబాద్ వేదికగా మరో పెద్ద ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం శంకర్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ ఇదే ఇయర్ రాబోతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన విలువైన మూడేళ్ల టైమ్ ను కేటాయించాడు. బుచ్చిబాబుతో చరణ్ మూవీ లేటవడానికి కూడా రీజన్ ఇదే. ఇండియన్2 హిట్ అయితే గేమ్ ఛేంజర్ కు కలిసొస్తుంది కానీ ఒకవేళ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మీద పడి లేని పోని ఇబ్బందులు తప్పవని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.













