రెహమాన్‌ను నమ్మొచ్చు
సంగీతంలో గొప్ప వ్యక్తి అనగానే అందరూ చెప్పే మొదటి పేరు ఏఆర్ రెహమాన్. కానీ అలాంటి ఆస్కార్ విజేత విషయంలో కూడా ఓ అసంతృప్తి ఉంది. ఆయన స్ట్రయిట్ గా తెలుగులో చేసిన ఏ సినిమాకూ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వలేదు. కెరీర్ స్టార్టింగ్ లో నివ్వు రవ్వ సినిమాకు బీజీఎం ఇచ్చి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు.
కానీ అవన్నీ డిజాస్టర్లే. డబ్బింగ్ రూపంలో ఎన్నో తిరుగులేని చార్ట్ బస్టర్స్ ఇచ్చిన రెహమాన్ నేరుగా తెలుగులో మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. అందుకే రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాకు రెహమాన్ సంగీతం అనగానే ఫ్యాన్స్ లో పలు సందేహాలు కలిగాయి. కానీ రీసెంట్ గా రిలీజైన ధనుష్ రాయన్ లో రెహమాన్ ఇచ్చిన బీజీఎం విన్నాక ఫ్యాన్స్ కు నమ్మకం కుదిరింది.
రాయన్ లో గొప్ప కంటెంట్ లేకపోయినా ఎన్నో సీన్స్ ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రెహమాన్ ఎలివేట్ చేశాడు. హీరోకు ఇచ్చిన బీజీఎం, ఎస్‌జె సూర్యతో ఫైటింగ్ టైమ్ లో ఇచ్చిన ట్యూన్ చాలా బాగున్నాయి. కాకపోతే ఈ సినిమాలో సాంగ్స్ తక్కువ ఉండటంతో మ్యూజిక్ పరంగా ఎక్స్ట్రా ఆర్డినరీ అనిపిచంలేకపోయింది. మొదటి సినిమా ఉప్పెనతోనే తన టేస్ట్ ను చాటుకున్న బుచ్చిబాబు ఇప్పటికే రెహమాన్ ను చాలాసార్లు కలిసి తనకు కావాల్సిన అవుట్ పుట్ ను రాబట్టుకుంటున్నాడు. కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాయని స్వయంగా రెహమానే చెప్పడంతో కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.













