Peddi: పెద్ది విషయంలో టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్..ఎందుకంటే

రీసెంట్ గా రిలీజైన థగ్ లైఫ్(Thug Life) సినిమాను ముందు నుంచే రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ ఓ కంట కనిపెట్టి ఉన్నారు. దానికి కారణం థగ్ లైఫ్ మ్యూజిక్ డైరెక్టర్, రామ్ చరణ్ పెద్ది(Peddi) మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్(Rahman) అవడమే. థగ్ లైఫ్ సినిమాకు రెహమాన్ మంచి అవుట్‌పుట్ ఇచ్చి ఉంటే అందరూ హ్యాపీగా ఉండేవారు కానీ సాంగ్స్, బీజీఎం రెండూ నీరసంగా ఉండటంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది.
మణిరత్నం(Mani Ratnam) లాంటి డైరెక్టరే రెహమాన్ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకోలేనప్పుడు ఇక బుచ్చిబాబు(Buchibabu) వల్ల ఏమవుతుందని అనుమాన పడుతున్నారు. అయితే బుచ్చిబాబు తన సినిమా విషయంలో ఎంత మొండిగా ఉంటాడో ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయింది. ఉప్పెన(uppena) సినిమా ఆల్బమ్ కోసం దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri prasad) ను ఎంతో సతాయించి మరీ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను తీసుకున్నాడు బుచ్చిబాబు.
పెద్ది సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ అవలేదు. అంతేకాదు, మొన్నా మధ్య వచ్చిన పెద్ది టీజర్ కు కూడా రెహమాన్ నుంచి మంచి మ్యూజిక్ తీసుకోగలిగాడు. రెండు మ్యూడు బీజీఎం లను కాదని, ఈ మ్యూజిక్ ను ఓకే చేసి టీజర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న బుచ్చిబాబు, రెహమాన్ నుంచి కచ్ఛితంగా మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటాడని, ఈ విషయంలో అనుమానమే అక్కర్లేదని ఆయన గురించి తెలిసిన అందరూ మాట్లాడుకుంటున్నారు. పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.