Nani: నానిపై ప్రేమ కురిపిస్తున్న మెగా ఫ్యాన్స్
మెగా ఫ్యాన్స్ కు మోస్ట్ ఫేవరెట్ హీరో అయిపోయాడు నేచురల్ స్టార్ నాని(Nani). సందర్భం వచ్చినప్పుడల్లా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పై తన అభిమానాన్ని చూపిస్తూ ఉండే నాని, ఇప్పుడు ఆ అభిమానాన్ని చేతల్లో చూపించాడు. చిరూ రీ ఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలు, సెలెక్ట్ చేసుకుంటున్న డైరెక్టర్ల విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
ఒక ఫ్యాన్ గా ఈ విషయాన్ని గ్రహించిన నాని, మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో మెగాస్టార్ సినిమాను సెట్ చేశాడు. దీని గురించి గత కొన్నాళ్లుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టును నానినే సెట్ చేస్తున్నాడనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ తనై నాని దీన్ని సెట్ చేశాడని తెలుసుకుని మెగా ఫ్యాన్స్ చాలా ఆనందపడుతున్నారు.
శ్రీకాంత్ ను నమ్మి దసరా చేయడమే కాకుండా తనపై నమ్మకంతో మరో సినిమాను అనౌన్స్ చేసిన నాని, ఇప్పుడు ఏకంగా శ్రీకాంత్ పై నమ్మకంతో చిరంజీవిని కల్పించి ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పించి తన ఫ్యానిజాన్ని బయటపెట్టాడు. అంతేకాదు నాని ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కూడా. స్వయంగా నానినే ఈ సినిమాను అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.













