వరుణ్ ని ఐపీఎస్, నిహారికను డాక్టర్ చేద్దామనుకున్నా – మెగా బ్రదర్ నాగబాబు
తన బిడ్డలు వరుణ్, నిహారిక పెళ్లిళ్లపై మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. కెరీర్ పరంగా వాళ్లకు తానూ ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనని.. కానీ వాళ్ల పెళ్లి చేయాల్సిన బాధ్యత మాత్రం తనపై ఉందన్నారు. ప్రస్తుతం అదే ఆలోచనలో ఉన్నానని, నిహారికకు వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తానని చెబుతున్నారు నాగబాబు.
“నిహారికకు సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్-మే లోపు పెళ్లి అయిపోతుంది. నిహారిక పెళ్లయిన తర్వాత వరుణ్ కు కూడా పెళ్లి చేయాలి. బహుశా.. వచ్చే ఏడాది చివరి నాటికి వరుణ్ కు పెళ్లయిపోతుంది. అలా కుదరకపోతే 2022లోనైనా వరుణ్ కు పెళ్లి చేయడం గ్యారెంటీ.” ఇలా తన పిల్లల పెళ్లిపై రియాక్ట్ అయ్యారు నాగబాబు. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయిపోతే తన బాధ్యత తీరిపోతుంది. పెళ్లిళ్లు చేసేస్తే నిహారిక భర్త, వరుణ్ భార్య ఇకపై వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు తండ్రి నేను కాస్త రిలాక్స్ అవుతాను అంటూ తన కొడుకు కూతూళ్ల గురించి తనేమనుకున్నాడో ఇప్పుడేం జరిగిందో చెప్పుకొచ్చాడు.
ప్రతి తండ్రికి తమ పిల్లల్ని టాప్ పోసిషన్ లో చూడాలనుకుంటారు నాగబాబుకు కూడా వరుణ్ తేజ్, నిహారిక విషయంలో అలాంటి కొరికే ఉండేది. వరుణ్ ను ఐపీఎస్ ఆఫీసర్ ని చేద్దామనుకున్నారు ఇక నిహారికను డాక్టర్ చదివిద్దాం అనుకున్నారట. కానీ తన అభిమంతం వాళ్ళ మీద బలవంతంగా రుద్దలేదు.
నాగబాబు మాటల్లో- “వరుణ్ ని ఐపీఎస్ ని చేద్దాం అనుకున్నాను. పాప నిహారికను డాక్టర్ ను చేద్దాం అనుకున్నాను. ఇది నా కోరిక మాత్రమే. అలాగని నేనెప్పుడూ వాళ్లపై రుద్దలేదు. వరుణ్ అయితే ఇంటర్మీడియట్ నుంచే నా మాట వినడం మానేశాడు. నిహారికను మాత్రం డాక్టర్ ను చేద్దామని బాగా ఇన్ స్పైర్ చేశాను. కానీ ఒకరోజు ఎందుకో నాకే అనిపించింది. డాక్టర్ అవ్వాలంటే మినిమమ్ గా ఎంబీబీఎస్ చదివితే సరిపోదు. స్పెషాలిటీ-సూపర్ స్పెషాలిటీ చేయాలి. ఈ స్టేజ్ వరకు రావాలంటే అమ్మాయికి 32 ఏళ్లు వచ్చేస్తాయి . ఎందుకో నిహారిక విషయంలో అంత కష్టాన్ని నేను ఊహించలేకపోయాను. నా కోరికను చంపుకున్నాను. మీకు నచ్చినట్టు ఉండమని వదిలేశాను. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లోకి వచ్చేసారు”.













