రెండు భాగాలుగా మెగా 156?
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో మెగా 156 సినిమా రీసెంట్‌గానే అనౌన్స్ అయింది. రికార్డింగ్ తో రీసెంట్గా మొదలైన ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నారట. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న చిరూ మార్కెట్‌కు ఇది చాలా ఎక్కువ బడ్జెట్.
అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు కానీ దీని గురించి మాత్రం చర్చలు జరుగుతున్నాయట. చిరూ వరుణ్ పెళ్లి నుంచి రాగానే ఈ రెండు భాగాల ప్రతిపాదనను చిరూ ముందు ఉంచుతారని టాక్. అయితే ఈ సినిమాను కావాలని రెండు భాగాలుగా చేయట్లేదని, సినిమా కథలో అంత స్కోప్ ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది.
ఇందులో ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఇది నిజమైతే మాత్రం చిరూ ఎక్కువ మొత్తంలో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. భోళా శంకర్ తర్వాత ఏ డైరెక్టర్‌ను అంత ఈజీగా నమ్మట్లేదు చిరూ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను రెండు భాగాలంటే ఆయన ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక పోతే చిరూతో మిత్రన్ సినిమా గురించి కూడా అతి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది.













