MEGA154 టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని చెప్పకనే చెప్పేసిన శేఖర్ మాస్టర్
MEGA154 షూటింగ్ లో పాల్గొన్న శృతి హాసన్ శేఖర్ మాస్టర్ తాజాగా మాట్లాడుతూ.. చిరంజీవి, బాబీ ప్రాజెక్ట్ గురించి చెప్పకనే చెప్పేసిన అసలు విషయం చెప్పేసాడు. MEGA154 సినిమాకు పని చేశాను అంటూ చెబుతూ టైటిల్ రివీల్ చేశాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ చెప్పిన ఆ టైటిల్ వైరల్ అవుతోంది. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాడు. ఆచార్య నుంచి విడుదలైన భలే భలే బంజారా స్టెప్పులు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరించాడు.
శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ యూట్యూబ్ చానెళ్లలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసిన సమయంలో జరిగిన ఘటనలు, రామ్ చరణ్ చిరంజీవిలతో పని చేసిన అనుభవం గురించి శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ ఓ మ్యాటర్ లీక్ చేసేశాడు. తనకు తెలియకుండానే ఆ విషయం బయటకు వచ్చేసినట్టుంది. ఎందుకంటే చిరంజీవి బాబీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే అది మరీ ఓల్డ్ పేరుగా ఉందని, ఇంకో టైటిల్ ట్రై చేస్తున్నారంటూ కూడా కథనాలు వచ్చాయి. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ ఆ టైటిల్‌ను కన్ఫామ్ చేసేశాడు. వాల్తేరు వీరయ్య అని టైటిల్ చెప్పేశాడు. ఆసినిమాలో ఓ పాట కంపోజ్ చేస్తానని చెప్పేశాడు. ఇప్పటికే భోళా శంకర్ చిత్రంలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసేశాని అన్నాడు. మొత్తానికి శేఖర్ మాస్టర్ చెప్పిన ఈ మాటలు, లీక్ చేసిన దెబ్బకు ఒక్కసారిగా టీం నిరుత్సాహపడ్డట్టు తెలుస్తోంది. టైటిల్ ప్రకటనను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నారేమో. కానీ ఇలా శేఖర్ మాస్టర్ తనకి తెలియకుండానే టైటిల్‌ను బయటపెట్టి కొంపముంచేశాడు.
Mega 154 సినిమా నుంచి మరో ఓ అప్డేట్ బయటకొచ్చింది. తాజాగా ఈ సినిమా సెట్స్‌పై శృతి హాసన్ అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో MEGA154 పేరుతో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నుంచి ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తున్న శృతి హాసన్ ఈ మెగా అప్డేట్ చెప్పింది. తాను ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చానని చెబుతూ ఓ సెల్ఫీ పిక్‌ని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది శృతి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతుండగా ఇప్పుడు శృతి ఎంట్రీ ఇచ్చింది. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, చిరంజీవిల మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. భారీ రేంజ్లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి లుక్ కూడా విడుదల చేసి సినిమా పట్ల ఆసక్తిని పెంచేశారు పక్కా మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగం కాబోతున్నారని టాక్.
మరోవైపు శృతి హాసన్ కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోంది. అలాగే బాలకృష్ణ సరసన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తోంది శృతి హాసన్.













