Meenakshi Chaudhary: ట్రోలింగ్ వల్ల కుమిలిపోయిన మీనాక్షి
సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ వేరే తారల పై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో ఎవరూ ఊహించలేం. హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది. సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు ఈ విషయాన్ని వెల్లడించింది. మీనాక్షి నటించిన గోట్ సినిమా గతేడాది రిలీజైన విషయం తెలిసిందే.
ఆ సినిమా వల్ల మీనాక్షికి పేరు రాకపోగా ట్రోలింగ్ ఎదురైంది. గోట్(GOAT) లో విజయ్(Vijay) కొడుకు పాత్రకు జోడీగా నటించిన మీనాక్షి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే కాకుండా విజయ్ చేతిలోనే ఆ పాత్ర చనిపోతుంది. ఈ సినిమా చూశాక కొందరు నెటిజన్లు తనను కారణం లేకుండా టార్గెట్ చేసి మరీ బాధ పెట్టారని, దాని వల్ల డిప్రెషన్ కు లోనైనట్టు మీనాక్షి తెలిపింది.
ఆ ట్రోల్స్ తో కుమిలిపోతున్న టైమ్ లోనే లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిది. ఆ సినిమాలో దుల్కర్ భార్యగా మీనాక్షి అందరి మనసుల్ని గెలుచుకుంది. ప్రస్తుతం తన ఆశలన్నీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాపైనే పెట్టుకుంది మీనాక్షి. తనకు ఎప్పట్నుంచో పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని ఉందని ఈ సినిమాతో ఆ కోరిక తీరిందని చెప్తున్న మీనాక్షికి సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













