మీనాక్షి కోరుకున్న బ్రేక్ ఇప్పుడైనా దక్కుతుందా?
టాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ రావడం ఒకెత్తయితే వరుస ఛాన్స్ లు రావడం మరో ఎత్తు. అయితే అవకాశాలు ఎక్కువగా వచ్చినప్పటికీ సక్సెస్ రేట్ పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) పరిస్థితి ఇదే. స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ మీనాక్షికి ఇప్పటివరకు సరైన హిట్ పడింది లేదు.
గుంటూరు కారం(Guntur Karam) సినిమాలో శ్రీలీల(Sree Leela) మెయిన్ హీరోయిన్ కావడంతో పాటూ మీనాక్షి క్యారెక్టర్ ను మరీ నాసిరకంగా డిజైన్ చేయడంతో ఆ సినిమా చేసినా వృధానే అయింది. తర్వాత విజయ్(Vijay) తో గోట్(Greatest of all time) సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఇంకేముంది మీనాక్షి సెటిలైపోయినట్టే అనుకున్నారంతా. కానీ ఆ సినిమాలో విజయ్ చేసిన నెగటివ్ పాత్రకు జోడీగా పెట్టడమే కాకుండా ఆ పాత్రను సెకండాఫ్ లో చంపేయడంతో ఆ సినిమా కూడా అమ్మడి కెరీర్ కు ఏమీ ఉపయోగపడలేదు.
ఇప్పుడు లక్కీభాస్కర్(Lucky Bhaskar) వంతొచ్చింది. దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కు జోడీగా మీనాక్షి నటించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ డైరెక్టర్ అయినా మీనాక్షికి మంచి క్యారెక్టర్ ఇచ్చాడా లేదంటే సరైన బ్రేక్ కోసం ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలా అనేది చూడాలి. చూస్తుంటే లక్కీ భాస్కర్ లో మీనాక్షి పాత్రకు ప్రాధాన్యమున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత మీనాక్షి నటించిన మెకానిక్ రాకీ(mechanic Rockey), మట్కా(matka) సినిమాలు కూడా తక్కువ గ్యాప్ లోనే రిలీజ్ కాబోతున్నాయి.













