బంపరాఫర్ కొట్టేసిన మీనాక్షి
మీనాక్షి చౌదరి. టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించినా అమ్మడుకు రాని గుర్తింపు ఒక్కసారిగా గుంటూరు కారంలో నటిస్తుందని తెలియగానే వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంటే, మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఎప్పుడైతే మీనాక్షి, మహేష్ సినిమాలో ఛాన్స్ ను కొట్టేసిందో అప్పుడో అందరూ ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. అంతేకాదు వరుస ఆఫర్లు కూడా అమ్మడి తలుపు తడుతున్నాయి. మీనాక్షికి తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా ఇతర భాషల నుంచి కూడా అవకాశాలొస్తున్నాయని సమాచారం.
తాజాగా మీనాక్షి చౌదరి మరో బంపరాఫర్ ను పట్టేసినట్లు సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రానున్న సినిమాలో మీనాక్షిని హీరోయిన్గా ఫైనల్ చేశారట. గుంటూరు కారంలో సెలెక్ట్ అయిన కారణంగానే మీనాక్షి ఈ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఛాన్స్ రావడం నిజమే అయితే, ఈ రెండు సినిమాల రిలీజ్ తర్వాత అమ్మడు బిజీ అయిపోవడం ఖాయమంగానే కనిపిస్తుంది.













