మీనాక్షి విషయంలో మ్యాజిక్ జరుగుతుందా?
ఎంతసేపూ గుంటూరు కారం పాటల గొడవ తప్పించి, మిగిలిన విషయాల్ని మాత్రం ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. అందులో ముఖ్యమైనది హీరోయిన్ల గురించి. రీసెంట్గా శ్రీలీల క్యారెక్టర్ ను సాంగ్ ద్వారా రివీల్ చేశారు. మహేష్ వెంట పడుతూ తనను ఎంతో ప్రేమించే అమ్మాయిగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించనుంది.
ఓ మై బేబీ సాంగ్‌ను బట్టి చూస్తే గుంటూరు కారం మెయిన్ హీరోయిన్ శ్రీలీలనే అని అర్థమవుతుంది. ఈ సినిమాలో శ్రీ లీలతో పాటూ మీనాక్షి చౌదరి కూడా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు మీనాక్షి క్యారెక్టర్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వదల్లేదు. చూస్తుంటే ఈ సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు లేరు.
ఈ సినిమాలో ఉన్న పాటలు నాలుగే. వాటిలో రెండు డ్యూయెట్లు. ఆ రెండూ శ్రీలీలతోనే ఉంటాయని టాక్. మరోటి స్పెషల్ సాంగ్. మిగిలింది టైటిల్ సాంగ్. అంటే ఈ సినిమాలో మీనాక్షికి స్క్రీన్ స్పేస్ తక్కువే దొరికిందని అర్థమవుతుంది. ట్రైలర్ వచ్చాక ఈ విషయంలో మరింత క్లారిటీ రానుంది. ఈ సినిమాపై శ్రీలీలతో పాటూ మీనాక్షి కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన ఏ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ఈ సినిమాలో మీనాక్షికి ఏమైనా స్పెషల్ రోల్ ఇచ్చాడా లేక ఎప్పటిలానే నామమాత్రపు హీరోయిన్గా మీనాక్షిని తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.













