Meenakshi Chaudhary: స్పీడు తగ్గిస్తానంటున్న మీనాక్షి
వరుస విజయాలతో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudharu) కెరీర్ జెట్ స్పీడులో దూసుకెళ్తుంది. గతేడాది గుంటూరు కారం(Guntur Karam), లక్కీ భాస్కర్(Lucky Baskhar), గోట్(GOAT), మట్కా(Matka), మెకానిక్ రాకీ(Mechanic Rockey) సినిమాల్లో నటించి మెప్పించి మీనాక్షి సింగపూర్ సెలూన్(Singapore Saloon) అనే తమిళ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు కొత్త ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది మీనాక్షి.
అయితే మీనాక్షి ఇప్పుడు కెరీర్లో కొన్ని మార్పులు చేయబోతుంది. ఇకపై సినిమాలను నెంబర్ కోసం కాకుండా మంచి కథలు వస్తేనే ఎంచుకుంటానని, వరుసపెట్టి సినిమాలు చేయనని తెలిపింది. 2024లో అన్ని సినిమాలు రిలీజవుతాయని తాను అనుకోలేదని, అదంతా దానంతటదే జరిగిపోయిందని చెప్పుకొచ్చింది.
సినిమాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి తన టైమ్ మొత్తం ఎక్కువగా వాటికే కేటాయించానని, ఇకపై ఫ్యామిలీ కోసం, తన కోసం ఎక్కువగా కేటాయించాలనుకుంటున్నట్లు మీనాక్షి తెలిపింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) సరసన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమాలో నటిస్తున్న అమ్మడు దాంతో పాటూ మరో రెండు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి.













