చాలా ఏళ్ల తర్వాత అమ్మడి ఖాతాలో హిట్
ఇచ్చట వాహనములు నిలపరాదు(Ichata Vaahanamulu niluparadhu) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఆ తర్వాత రవితేజ(Raviteja)తో కలిసి ఖిలాడీ(Khiladi) సినిమాలో నటించింది. అదే ఇయర్ అడివి శేష్(AdiviSesh) తో కలిసి హిట్2(Hit2) లో నటించి కెరీర్లో మొదటి హిట్ ను అందుకుంది. ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం(Gunturu Karam) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది మీనాక్షి.
సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఆ సినిమాలో మీనాక్షికి పెద్దగా స్కోప్ లేని పాత్ర అది. రీసెంట్ గా విజయ్(VIjay) గోట్(GOAT) లో నటించింది కానీ సాంగ్స్ కే పరిమితమైంది. అలాంటి మీనాక్షి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. మీనాక్షి దీపావళికి రిలీజైన లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాలో దుల్కర్(Dulquer) తో కలిసి నటించి ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
ఈ సినిమాలో అమ్మడి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. హిట్2 తర్వాత అమ్మడి అకౌంట్ లో ఇన్నాళ్లకు సరైన హిట్ పడింది. ప్రస్తుతం మీనాక్షి నటించిన మట్కా(matka), మెకానిక్ రాకీ(mechanic Rockey) రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వెంకటేష్(Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలో కూడా మీనాక్షి కీలకపాత్రలో కనిపించనుంది. ఇవి కాకుండా ఫ్యూచర్ లో మీనాక్షి మరెన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.













