అప్పటి హీరోలను రిపీట్ చేస్తు బిజీ అవుతున్న సీనియర్ హీరోయిన్ మీనా

సీనియర్ హీరోయిన్ మీనా మరోసారి టాలీవుడ్ లో బిజీ నటి కాబోతుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్ లో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతున్నట్లు వార్తలు అందాయి. అప్పట్లో…. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు మీనా. తనదైన హావభావాలకు తోడు క్యూట్ లుక్స్‌తో అప్పటి యువతరాన్ని మెస్మరైజ్ చేశారు. దీంతో మరోసారి బాలకృష్ణ- మీనా మరో సారి జోడీ కట్టబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లేటెస్ట్ మూవీలో ఆమెను సెలక్ట్ చేసి పక్కాగా ప్లాన్ చేశారట మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. సీనియర్ నటిగా, అంతకు మించి బాలయ్య పర్ఫెక్ట్ జోడీగా ఆకట్టుకున్న ఆమెతో నేటితరం ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా ఆయన స్కెచ్చేశారట. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుసపెట్టి సీనియర్ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు మీనా.
ప్రస్తుతం రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’లో నటిస్తున్న ఆమె.. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆమె లేటెస్ట్ లుక్స్ యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో బాలకృష్ణ సరసన మీనా అయితే బెటర్ అని భావించిన గోపీచంద్ మలినేని.. ఆమెనే ఫైనల్ చేయాలనీ అనుకుంటున్నారట. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా అతిత్వరలో ప్రారంభం కానుందని మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలకృష్ణకు జోడీగా మీనా కనిపించనున్నారని, చిత్రంలో ఎంతో కీలకమైన ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతోందని సమాచారం.