చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకి సీనియర్ హీరోయిన్…
మీనా బాలనటిగా తెలుగు తెరకి పరిచయమై, హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు సూపర్ స్టార్స్ తో జత కట్టింది ఈ అమ్మడు. తెలుగు తో పాటు పలు భాషల్లో సుదీర్ఘ కాలంగా నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న మీనా గత కొన్నాళ్లుగా కెమెరా కు దూరంగా ఉందన్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా భర్త విద్యాసాగర్ మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ హీరోయిన్. ఈ మధ్యనే మళ్ళీ మెల్లగా కోలుకుంటుంది. ఈ తారుణంలోనే మీనా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా అప్పట్లో ఎన్నో వందల సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ, తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అమ్మగా, అత్తగా అన్ని రకాల పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలోనే భర్త విద్యా సాగర్ అనారోగ్యంగా ఉన్న సమయంలోనే మీనా కొన్ని సినిమాలను సైన్ చేసి ఉన్నారు. కొన్ని సినిమాలు క్యాన్సిల్ అవ్వగా, కొన్ని ఇంకా మీనా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ సినిమాల షూటింగ్స్ లో మీనా మళ్లీ పాల్గొనబోతుందట. దృశ్యం 3 సినిమా తో ఆమె సినీ జర్నీ మళ్లీ మొదలు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో మీనా పాల్గొంటున్నారు. ఆ వెంటనే దృశ్యం సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. భర్త విద్యాసాగర్ మృతి బాధ నుండి తేరుకునేందుకు ఇటీవలే మీనా తన కూతురితో విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఈమె కొన్ని వారాల పాటు సన్నిహితుల వద్ద ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన మీనా మెల్ల మెల్లగా సినిమాలతో బిజీ అవ్వాలని భావిస్తున్నారు.













