మార్చిలో మీడియం హీరోల పోటీ
ఒకప్పుడు సంక్రాంతి, దసరా లాంటి సీజన్లలో వచ్చే సినిమాలు మాత్రమే ముందుగానే రిలీజ్ డేట్ ను లాక్ చేసుకునేవి. కానీ ఇప్పుడు అలా కాదు. సిట్యుయేషన్స్ మారిపోయాయి. ఎప్పుడో మూడు నాలుగు నెలల తర్వాత రిలీజ్ డేట్స్ గురించి కూడా ఇప్పుడే నానాతిప్పలు పడుతున్నారు మేకర్స్. ముందు ఒక డేట్ ను అనౌన్స్ చేయడం, తర్వాత తప్పక కుదరకపోతే పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మామూలైపోయింది.
ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది 2024 మార్చిలో రానున్న సినిమాల గురించి చూస్తే మీడియం రేంజ్ హీరోలందరూ ఆ నెలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మార్చి 8కు రానున్నట్లు సినిమా మొదలుపెట్టినప్పుడే అనౌన్స్ చేశారు. అదే రోజున విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రిలీజ్ కానుంది.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను మార్చిలోనే రిలీజ్ చేస్తామని దిల్ రాజు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యాక రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పాడు. వీటితో పాటూ సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఊరు పేరు భైరవకోన, సుహాస్ నటిస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మార్చిలోనే రానున్నాయని తెలుస్తోంది. డేట్ దగ్గరకొచ్చే కొద్దీ ఈ లిస్ట్ మరింత పెరిగే ఛాన్సుంది.













