పని పూర్తి చేసిన మెగా ప్రిన్స్
వరుణ్ తేజ్(Varun tej) హీరోగా కరుణ కుమార్(karuna kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ మట్కా(matka). ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్, మేకింగ్ వీడియోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా మట్కా మేకర్స్ విషెస్ చెప్తూ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
మట్కా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మట్కా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో వరుణ్ విభిన్న లుక్స్ లో కనిపించనున్నాడు. మట్కాలో వరుణ్ నటన ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని చిత్ర యూనిట్ చెప్తుంది.
వరుణ్ కెరీర్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary), నోరా ఫతేహి(Nora Fathehi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఈ సినిమాకు కరుణ కుమార్ డైరెక్షన్ మేజర్ ప్లస్ పాయింట్ కానుందని, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని సమాచారం. అంతేకాదు సినిమాలో ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయంటున్నారు. గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న వరుణ్ ఈ సినిమాపైనే తన ఆశలను పెట్టుకున్నాడు.













