మత్తు వదలరా ట్రైలర్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటించిన చిత్రం మత్తు వదలరా. నరేస్ అగస్త్య, అతల్య చంద్ర, సత్య కీలక పాత్రధారులు. రితేష్ రానా దర్శకుడు. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనలతో రూపొందిన థ్రిల్లర్ ఇదన్నారు దర్శకుడు. మాలాంటి కొత్త వాళ్లను నమ్మి అవకాశమిచ్చిన మైత్రీ, క్లాప్ నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలన్నారు శ్రీ సింహా. ఉత్కంఠతో వినోదాత్మకంగా సాగే చిత్రమన్నారు కాల భైరవ. తక్కువ బడ్జెట్తో మంచి చిత్రం తీసినందుకు సంతృప్తిగా ఉందన్నారు రవిశంకర్.













